Laxman – Gambhir : ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ అనంతరం భారత జట్టు(Team India) గాడీలో పడేనా? అనే ప్రశ్నలకు జింబాబ్వే పర్యటనతో జవాబు దొరికింది. వరసగా రెండు సిరీస్‌లో కోల్పోయిన బాధను దిగమింగుతూ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) సేన.. ఆఫ్రికా జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. వారం క్రితం చేజారిన నంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకుంది టీమిండియా. అలాఅనీ ఈ క్రెడిట్ అంతా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ది కాదు. అప్పుడప్పుడు టీ20 జట్టుకు కోచ్‌గా వ్యవహరించే వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) హయాంలో అయ్యర్ సేన సిరీస్‌ను 3-0తో గెలిచింది. దాంతో.. ఈ ఫార్మాట్లో లక్ష్మణ్‌ను కోచ్‌గా కొనసాగిస్తారా? అనే చర్చ మొదలైంది.
టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుకు వైట్‌వాష్ అవమానం ఎదురైంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మార్గనిర్దేశం చేసినా కుర్రాళ్లతో నిండిన జట్టు పరిస్థితులను అర్ధం చేసుకోలేక.. నిలకడను ప్రదర్శించలేక సిరీస్‌లు కోల్పోయింది. ఫలితంగా.. గౌతీని టీ20 కోచ్‌గా తప్పించాలని, మళ్లీ సూర్యకుమార్ యాదవ్‌కే పగ్గాలు అప్పగించాలని డిమాండ్లు వచ్చాయి. అయితే.. వారంలోనే పరిస్థితి మారిపోయింది. వరసగా రెండు సిరీస్‌లు, నంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా మూడు మ్యాచుల సిరీస్‌లో 3-0తో జింబాబ్వేను చిత్తు చేసింది. కెప్టెన్ అయ్యరే అయినప్పటికీ కోచ్ మాత్రం వీవీఎస్ లక్ష్మణ్.
Reporter: 🗣️ VVS, would you like to become Team India’s permanent head coach and replace Gautam Gambhir in the future?
VVS Laxman: 🗣️ Gautam Gambhir and the senior team’s support staff are on a break after the England series, so I stepped in for this series. I’ve been doing this… pic.twitter.com/poIMFzJH75
— Central Cricket (@arshdeep3444) July 27, 2026
మూడో టీ20లో జింబాబ్వేపై 35 పరుగుల విజయం అనంతరం కెప్టెన్ అయ్యర్ డ్రెస్సింగ్ రూమ్‌లో లక్ష్మణ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘మేము ఏ పొరపాట్లు చేయలేదు. క్యాచ్‌లు వదలేయడం చాలా వరకూ తగ్గింది. సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంలో సహాయక సిబ్బందితో కలిపి జట్టులోని ప్రతిఒక్కరూ ఎంతో కృషి చేశారు. మమ్మల్ని ఎంతగానో ప్రేరేపించినందుకు, మాలో స్ఫూర్తి నింపినందుకు లక్ష్మణ్ సర్‌కు ధన్యవాదాలు. మైదానంలో దిగిన ప్రతిసారి వంద శాతం పోరాడాలని మీరు చెప్పారు. అందుకు మీకు కృతజ్ఞతలు’ అని అయ్యర్ పేర్కొన్నాడు.
Series victories are a reflection of the standards a team sets every single day. Proud of the commitment, resilience and selflessness shown by this group throughout the tour. Congrats to the players and thank you to the support staff for their unwavering dedication. I am… pic.twitter.com/qRqmPOIUBc
— VVS Laxman (@VVSLaxman281) July 26, 2026
భారత టీ20 కోచ్‌గా లక్ష్మణ్ విజయవంతమవుతున్నాడు. ఇదివరకు శ్రీలంక పర్యటనలోనూ లక్ష్మణ్ జట్టును విజేతగా నిలిపాడు. దాంతో.. అతడికే టీ20 కోచింగ్ బాధ్యతలు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు 2027 వన్డే ప్రపంచకప్‌తో హెడ్‌కోచ్‌గా గంభీర్ కాంట్రాక్ట్ ముగియనుంది. దాంతో.. తదుపరి టీమిండియా కోచ్‌గా లక్ష్మణ్‌ను నియమించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ మాజీ సొగసరి ఆటగాడు మాత్రం అందుకు సిద్ధంగా లేనని చెబుతున్నాడు. గౌతం గంభీర్, సీనియర్ కోచింగ్ సిబ్బంది అందుబాటులో లేనప్పుడు నేను కోచ్‌గా ఉంటానంతే అని లక్ష్మణ్ వెల్లడించాడు.