నవాబుపేట, జూన్ 30 : ఎరువుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నవాబుపేట మండలాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన రైతు నిరసనలో భాగంగా తహసీల్దార్ కార్యాలయ ముట్టడికి యత్నించగా పోలీసులు భగ్నం చేశారు.
ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మా ట్లాడుతూ.. గత బీఆర్ఎస్ సర్కార్‌లో రైతులకు ఎరువులు సక్రమంగా అందాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో భరత్‌రెడ్డి, శాంతికుమార్, పురుషోత్తంచారి, మహ్మద్‌గౌస్, ప్రచార కార్య దర్శి వెంకట్‌రెడ్డి, సంతోష్, ఫిర్దోస్ఖాన్, మహేశ్వర్‌రెడ్డి, ముకుంద్‌రెడ్డి, లింగంపల్లి మల్లేషం, మాణిక్‌రెడ్డి, కృష్ణారెడ్డి, గోవర్ధ్ధన్, రాజు, ఆసిఫ్‌ఖాన్, శేఖర్, మల్లేశం పాల్గొన్నారు.