షాబాద్, మార్చి 3 : ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం..షాబాద్ మండలంలోని పోలారం గ్రామానికి చెందిన చేగూరి విఠల్‌రెడ్డి(55) గురువారం తన బైక్‌పై సీతారాంపూర్ గ్రామానికి వెళ్తుండగా.. షాబాద్ వైపు నుంచి వేగంగా వస్తున్న డీసీఎం అతడి బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన విఠల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం చేవెళ్ల ప్రభుత్వ దవఖానకు తరలించారు.