రంగారెడ్డి జిల్లా ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న జిల్లా మరింత ప్రగతిని సాధించేలా రాష్ట్ర సర్కార్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయం తీసుకున్నది. ఇందుకు కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ మీదుగా పెద్ద అంబర్‌పేట వరకు, శంషాబాద్ జంక్షన్ నుంచి కొత్తూరు మీదుగా షాద్‌నగర్ వరకు, ఎయిర్ పోర్ట్ నుంచి తుక్కుగూడ ఓఆర్ఆర్, మహేశ్వరం ఎక్స్ రోడ్డు మీదుగా కందుకూరు వరకు వచ్చే మూడు, నాలుగేండ్లలో మెట్రో రైలు విస్తరణ జరుగనున్నది. ఇందుకు రూ.16,650కోట్ల అంచనా వ్యయంతో 67కి.మీ.ల మేర కొత్తగా రైలు మార్గం అందుబాటులోకి రానున్నది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను మెట్రో రైల్ అథారిటీ రూపొందించి ప్రభుత్వానికి త్వరలోనే అందించనున్నది. మెట్రో రైలు మార్గం పూర్తైతే దూరభారం, ట్రాఫిక్, వాహన కాలుష్యం వంటి ఇబ్బందులు తప్పనున్నాయి. పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులు ఇష్టమైన చోటే నివాసం ఉంటూ ఈజీగా జర్నీ చేయవచ్చు. సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, అద్దెకు ఉండాలన్నా.. మెట్రో రైలు మార్గాన్ని పరిగణనలోకి తీసుకునే వీలున్నది. దీంతో మెట్రో రైలు మార్గం వెంట ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. మెట్రో రైలు విస్తరణతో జిల్లాలో నవశకం ఆరంభమై నలుమూలలా అభివృద్ధి చెందనుండడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– రంగారెడ్డి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్ నగరంలో ఓ భాగంగా ఉన్న రంగారెడ్డి జిల్లా అభివృద్ధి దిశగా పురోగమిస్తున్నది. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న ఈ ప్రాంతంలో భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మెట్రోరైలు సేవలను విస్తరించాలని నిర్ణయించగా.. రాష్ట్ర కేబినెట్ కూడా పచ్చజెండా ఊపింది. రూ.16,650 కోట్ల అంచనా వ్యయంతో 67 కి.మీల మేర పెద్దఅంబర్‌పేట, షాద్‌నగర్, కందుకూరు తదితర ప్రాంతాలకు మెట్రోరైలును విస్తరించనుండటంతో జిల్లా అభివృద్ధిలో పలు మార్పులకు నాంది పలుకనున్నది. జిల్లా నలుమూలలకు మెట్రోరైలు పరుగులు తీయనుండడంతో ఈ ప్రాంత ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
రంగారెడ్డి, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : అనతి కాలంలోనే జిల్లా ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తున్నది. ఊహ కందని రీతిలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెం దుతున్నది. అదేస్థాయిలో జిల్లాలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రానున్న మూడు, నాలుగేండ్లలో పెద్దఅంబర్‌పేట, షాద్‌నగర్, కందుకూరు తదితర ప్రాంతాలకు మెట్రో రైలు సేవలను విస్తరించాలని పూనుకున్నారు. మెట్రో రెండోదశలో భాగంగా ఇప్పటికే రాయదు ర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కి.మీ మేర మెట్రోరైలును విస్తరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.6,250 కోట్లతో చేపడుతున్న ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకున్నది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరుకు సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా మెట్రో రైలును విస్తరించాలని జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సైతం పలు సందర్భాల్లో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే జిల్లాలోని నలుమూలలకు మెట్రోరైలును పరుగులు పెట్టించేందుకు సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ మీ దుగా పేద్ద అంబర్‌పేట వరకు, శంషాబాద్ జంక్షన్ నుంచి కొత్తూరు మీదుగా షాద్‌నగర్ వరకు, ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూ డ ఓఆర్ఆర్, మహేశ్వరం ఎక్స్‌రోడ్డు మీదుగా కందుకూరు వరకు వచ్చే మూడు, నాలుగేండ్లలో మెట్రో రైలును విస్తరించనున్నారు. రూ. 16,650 కోట్ల అంచనా వ్యయంతో 67 కి.మీల మేర కొత్తగా రైలు మార్గం అందుబాటులోకి రానున్నది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను మెట్రోరైల్ అథారిటీ రూపొందించి ప్రభుత్వానికి త్వరలోనే అందించనున్నది.
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్న అభివృద్ధి మెట్రోరైలు విస్తరణతో జిల్లాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నది. జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలతోపాటు పారిశ్రామికవాడలు ఏర్పాటవుతున్నాయి. కందుకూరు ప్రాంతం లో ఫార్మాసిటీ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇతర రాష్ర్టాలకు చెందిన చాలామంది నిరుద్యోగులు ఉద్యోగం, ఉపాధి కోసం జిల్లాకు తరలివచ్చి నివాసముంటున్నారు. అయితే దూరభారం, ట్రాఫిక్ సమస్యలు, వాహన కాలుష్యం వంటివి చాలామందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నివాసం ఒక చోట, కొలువు మరో చోట ఉండడంతో రవాణా పరంగానూ అవస్థలు పడుతున్నారు. అయితే మెట్రో తో రాబోయే రోజుల్లో ప్రయాణం సులువుగా మారనున్నది. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా ఇష్టమైన చోటే నివాసం ఉంటూ ఈజీగా జర్నీ చేయొచ్చు. సొంతంగా ఇల్లు కొనుక్కోవాలన్నా, అద్దెకు ఉండాలన్నా.. మెట్రోరైలు మా ర్గాన్ని పరిగణనలోకి తీసుకుని చాలామంది నివాసం ఏర్పా టు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి అనేది ఒక్క ప్రాంతానికే పరిమితం కా కుండా మెట్రోరైలు మార్గం వెంట ఉన్న అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
జనాభాకు అనుగుణంగా పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్య జటిలమవుతున్నది. కొద్దిపాటి దూరానికి సైతం గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రజలు మెట్రో ప్రయాణం వైపు మొ గ్గుచూపుతున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా గమ్యస్థానాలకు తక్కువ సమ యంలోనే చేరుకుంటున్నారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతున్నది. రహదారుల వ్యవస్థలో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో భాగంగా విస్తృతంగా ఫ్లైఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎల్బీనగర్ జంక్షన్ అభివృద్ధ్దితో అక్కడ ప్రజలకు ట్రాఫిక్ సమస్య తప్పింది. ఇదే ఒరవడితో ప్రభుత్వం మెట్రోరైలును కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తరించనుండటంతో రవాణా పరంగా ఇబ్బందులు శాశ్వతంగా తీరనున్నాయి. ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ రూపంలో అందుబాటులోకి వస్తే రాయదుర్గం నుంచి కేవలం 25 నిమిషాల్లోనే విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అలాగే..హైదరాబాద్‌తోపాటు చుట్టూ ఉన్న జిల్లాలకు రంగారెడ్డి జిల్లాతో కనెక్టివిటీ ఎక్కువగా ఉన్నది. పెద్దఅంబర్‌పేట, షాద్‌నగర్, కందుకూరు ప్రాంతాలకు మెట్రోరైల్ సేవలను విస్తరిస్తే నలుమూలలకు గంటల తరబడి కాకుండా నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
నందిగామ, ఆగస్టు 1: శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు మెట్రో రైలును విస్తరిస్తామ ని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గొప్ప విజన్ ఉన్న నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అని కొనియాడారు. షాద్‌నగర్ వరకు మెట్రో సేవలను విస్తరిస్తే షాద్‌నగర్‌కు మహర్దశ వస్తుంద ని.. ఈ ప్రాంతం ఎంతో ప్రగతిపథంలో ముందుకు వెళ్తుందన్నారు. సీఎం కేసీఆర్, మం త్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షురాలు కట్న లత, సర్పంచ్‌లు చంద్రారెడ్డి, నర్సింహులు, అశోక్, జట్ట కుమార్, స్వామి, కవిత, ఎల్లమ్మ, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, కో-ఆప్షన్ సభ్యురాలు బేగ్, బీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం, శ్రీనివాస్‌రెడ్డి, శ్రవణ్, గోపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్, వీరేందర్‌గౌడ్, రమేశ్, శ్రీపాల్‌రెడ్డి, శ్రీనివాస్, పాండు, సుదర్శన్‌గౌడ్, యాదగిరిరెడ్డి, రామకృష్ణారెడ్డి, నర్సింహ, శరత్కృష్ణ, సాయియాదవ్, శ్రీహరి, రమేశ్, పాషా పాల్గొన్నారు.
హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా షాద్‌నగర్ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించడం సంతోషకరం. మెట్రో ఏర్పాటుతో సమ యం ఆదా అవుతుంది. సకాలంలో చేరుకోవ చ్చు. మెట్రో రాకతో షాద్‌నగర్ రూపురేఖలు పూర్తిగా మారిపో తాయి. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లి రావాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-శివకుమార్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, షాద్‌నగర్‌టౌన్
హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా షాద్‌నగర్ పట్టణానికి మెట్రోలైన్ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించడం హర్షణీయం. షాద్‌నగర్‌కు మెట్రోరైల్ వస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. మె్ర టో ఏర్పాటుకు సంకల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, షాద్‌నగర్ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-విశాలాశ్రావణ్రెడ్డి, జడ్పీటీసీ కేశంపేట
హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు మెట్రోరైలును ఏర్పాటు చేస్తే షాద్‌నగర్ పట్టణంతోపాటు కొత్తూరు, నందిగామ మండలాల్లో ఉహించని విధంగా అభి వృద్ధి జరుగుతుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గొప్ప విజన్‌తో పని చేస్తున్నారు. అందువల్లె దేశంలోని ఏ రాష్ట్రంలోని లే ని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి.
– జిల్లెల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ నందిగామ
మెట్రోరైలు విస్తరణ ప్రకటనతో పెద్దఅంబర్‌పేట చుట్టు పక్కల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పటినుంచో కోరుకుంటున్న కల నిజం కానున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తోపాటు మెట్రో విస్తరణకు కృషి చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. మెట్రోతో ట్రాఫిక్ తగ్గుతుంది. పెద్దఅంబర్‌పేట అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది.
– సిద్దెంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ
మెట్రో రైలు త్వరలోనే పెద్దఅంబర్‌పేట వరకు వస్తుందని తెలిసి చాలా సంతోషపడ్డా. ఇప్పటివరకు మేం మెట్రో ఎక్కాలంటే అటు నాగోల్ లేదా ఇటు ఎల్బీనగర్కు వెళ్లాల్సి వచ్చే ది. కానీ, మాకు దాదాపు రెండు కిలోమీటర్ల లోపే మెట్రో సౌలభ్యం త్వర లోనే రానుండటం నిజంగా శుభపరిణామం. మెట్రో సేవల విస్తరణతో బీఆర్ఎస్ ప్రజలకు మరింత చేరువవుతుంది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ప్రగతి పరుగులు పెడుతుంది. ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– పడమటి సుమన్‌రెడ్డి, కుంట్లూరు
మెట్రోరైలు వచ్చిన తర్వాత సిటీలో ట్రాఫిక్ తగ్గింది. మెట్రో సేవలు పెద్దఅంబర్‌పేట వరకు వస్తాయని అస్సలు అనుకోలేదు. ఇక్కడి ప్రజలకు మెట్రో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నగరంలో ఎక్కడైనా సులువుగా తిరిగే అవకాశం ఉంటుంది. మెట్రో రాకతో పెద్దఅంబర్‌పేట వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందుతుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇది చాలా సౌలభ్యంగా మారుతుంది.
– పాలడుగు నాగార్జున, పెద్దఅంబర్‌పేట
కందుకూరు, ఆగస్టు 1 : అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్‌పేట పరిధిలోని ఎస్‌వైఆర్ గార్డెన్లో మండల అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీ ర్చిదిద్దుతున్నట్లు వివరించారు. రానున్న మూ డు, నాలుగేండ్లలో కందుకూరు వరకు మెట్రో రైలు పరుగులు తీయనున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. మెట్రో సేవలతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని.. హైదరాబాద్ నగరానికి రాకపోకలు సులువు అవుతుందని మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ర్టాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ర్టాభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైఎస్ చైర్మన్ విజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పా ర్టీ మండలాధ్యక్షుడు జయేందర్, కృష్ణారాంభూపాల్రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి. , ఇందిరమ్మ దేవేంద ర్, శ్రీనివాసాచారి, తహసీల్దార్ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకట్రాములు, విద్యుత్ ఏఈ రమేశ్‌గౌడ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ టౌన్, ఆగస్టు 1: హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు మెట్రోరైలును విస్తరించాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ము న్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ హర్షం వ్య క్తం చేశారు. మంగళవారం ఆయన పట్టణ ము ఖ్యకూడలిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి పటాకులు కాల్చి స్వీట్లను పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ మెట్రోరైల్ విస్తరణతో షాద్‌నగర్‌కు మహర్దశ పడుతుందన్నారు. మెట్రోతో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మెట్రో ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు పట్టణ ముఖ్యకూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూ లమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎంఎస్ నటరాజ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీనర్సింహారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నారాయణ, శంకర్, నందకిశోర్, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, శేఖర్, సుధాకర్, గోపాల్, విజయ పాల్గొన్నారు.
కొత్తూరు, ఆగస్టు 1: మెట్రో రైలు రాకతో కొ త్తూరు దశ పూర్తిగా మారు తుందని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యాదేవేందర్యాదవ్ అన్నారు. శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్‌నగర్ వరకు మెట్రో రైలును విస్తరించాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ మం గళవారం కొత్తూరు చౌరస్తాలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణసంచా కాల్చారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడు తూ కొత్తూరుకు మెట్రోరైలు వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందని.. హైదరాబాద్‌కు రాకపోకలు సులువుగా మారుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, బీఆర్ఎస్ నాయకులు లింగంనాయక్, యాదయ్య, సర్పంచ్‌లు సాయిలు, సత్తయ్య, ఆంజనేయులు, శివకుమార్, జైపాల్, శ్రీశైలం, పద్మారావు, భీమయ్య, గోవింద్‌రెడ్డి, రాజు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.