వికారాబాద్, సెప్టెంబర్ 19 : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాం డ్ చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆయన విద్యార్థులతో కలిసి ర్యాలీ తీసి ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన ఏడాదిలోపే ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని చెప్పి ఇప్పటికీ చెల్లించలేదని మండిపడ్డారు.
మూసీనది సుందరీకరణకు, ఫోర్త్ సిటీ నిర్మించేందుకు రూ. లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు ముందుకెళ్తున్న ప్రభుత్వం పేద పిల్లలు చదువుకునే పథకానికి నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంపై దారుణమని మండిపడ్డారు. అనంతరం పోలీసులు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకుల ను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
వారిపై పలు కేసులు నమోదు చేశారు. నిరసనలో బీఆర్ఎస్వీ మోమిన్పే ట మండల ఇన్చార్జి ఎండీ అబ్దుల్, సర్ఫరాజ్, ఆయా కళాశాలల విద్యార్థులు అధికంగా పాల్గొన్నారు.