ఇండ్లల్లో ఉండకపోతే రద్దే..
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా వాటిలో నివసించాలని, లేకపోతే కేటాయింపులు రద్దు చేస్తామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు.
- రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి
- మార్చి 31 డెడ్లైన్.. ఆ తర్వాత కఠిన చర్యలు
ఆదిబట్ల, మార్చి 18 : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా వాటిలో నివసించాలని, లేకపోతే కేటాయింపులు రద్దు చేస్తామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న 2బీహెచ్కే ఇండ్ల కేటాయింపుపై అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించిన కలెక్టర్.. ఇప్పటికే ఇండ్లు పొందినవారు అదే గడువులోపు వాటిలో నివాసం ఉండాలని తెలిపారు.
లేకపోతే ఏప్రిల్ తొలి వారంలోనే ఆ ఇండ్లను రద్దు చేసి కొత్త అర్హులకు కేటాయిస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్-2 జాబితాలోని అర్హులను ఎంపిక చేసి, మంత్రి ఆమోదంతో గెజిటెడ్ అధికారుల ధ్రువీకరణ అనంతరం మంజూరు చేయనున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చాంప్లానాయక్, ఆర్డీఓలు అనంతరెడ్డి, జగదీశ్వర్రెడ్డి, వెంకట్రెడ్డి, సరిత, పార్థసింహరెడ్డి, తహసీల్దార్లు, హౌసింగ్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

