షాద్‌నగర్‌రూరల్ : తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చేపడుతున్న అభివృద్ధి పనులతో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం గులాబీమయంగా మారింది. ఫరూఖ్‌నగర్ మండలంలోని విఠ్యాల గ్రామంతో పాటు శ్యామలబండా తండాలోని 3వ వార్డు మెంబర్ శాంతమ్మ పాపయ్యతో కలిపి మొత్తం 30మంది కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు శుక్రవారం గ్రామ సర్పంచ్ జయశ్రీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ ఫథకాలే పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు.
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత, ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చెరుతుడటం సంతోషంగా ఉందన్నారు. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేసి తండావాసుల ఆరాధ్య ధైవంగా కేసీఆర్ నిలిచాడన్నారు. అనంతరం గ్రామభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి పనులు భాగున్నాయన్ని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న గ్రామసర్పంచ్ జయశ్రీ చంద్రశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ఈటగణేశ్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజాఇద్రీస్ అహ్మద్, సీనియర్ నాయకులు లక్ష్మణ్‌నాయక్, గ్రామకమిటీ అధ్యక్షుడు మల్లేష్‌యాదవ్, ఆర్.శంకర్, వాహబ్, లింగం పాల్గొన్నారు.