Shadnagar : రైతుల మోహల్లో సంతోషం.. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్

షాద్‌నగర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా తమ పంటలను సాగు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతుబంధు సంబురాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభను చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేసి మాట్లాడారు. రైతుబంధు ఫలాలు నేరుగా రైతులకు అందుతుండటంతో రైతుల మోహల్లో సంతోషం కనిసిపిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రైతు సంక్షేమం కోసం పరితపిస్తున్న తీరును దేశంలోని అన్ని ప్రాంతాల రైతులు హర్షిస్తున్నారని అన్నారు. నేటి తరం విద్యార్థులు, యువతి, యువకులు వ్యవసాయ రంగం అభివృద్ధి, ఆవశ్యకత, సాగు విధానంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఇందులో భాగంగానే రైతుబంధు ప్రాముఖ్యతపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభను చూపిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. పలువురు విద్యార్థులు గీసిన చిత్రలేఖనంను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు వేసిన రంగవళ్లులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, ఎంఈఓ శంకర్‌రాథోడ్, టీఆర్ఎస్ నాయకులు మన్నె నారాయణయాదవ్, గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

