వికారాబాద్, డిసెంబర్ 18 : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వికారాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. వికారాబాద్‌తో పాటు మర్పల్లి, మోమిన్‌పేట, ధారూరు, కోట్‌పల్లి, బంట్వారం నవాబుపేట మండలాల్లోని గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాయి. 2014 తరువాత నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఏడు గురుకులాలు మంజూరు అయ్యాయి. ప్రభుత్వం మారు మూల గ్రామాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో గురుకులాలకు శ్రీకారం చుట్టింది.
విద్యతో పాటు, వసతి, నాణ్యమైన భోజన సదుపాయాలతో కూడిన సౌకర్యాలు కల్పిస్తున్నది. వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేటలో బాల, బాలికల మైనా ర్టీ గురుకు లాలు, ప్రభుత్వ జూనియన్, డిగ్రీ కళాశాలలు మంజూరు అయ్యాయి. జ్యోతి బాపూలే గురుకులాలు, మోమిన్‌పేట మండలంలో డ్రాపౌట్ విద్యార్థుల కోసం అర్బన్ పాఠశాలను ఏర్పాటు చేశారు. 2014 తరువాత పాలిటెక్నిక్ కళాశాల భవనం మంజూరు అయ్యింది.
శివారెడ్డిపేట మైనార్టీ గురుకుల పాఠశాల
నాణ్యమైన విద్యాబోధన
పట్టణంలోని మైనార్టీ గురుకులంలో గత ఏడాది 10వ తరగతిలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఇంటర్ విద్యార్థి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించి గురుకుల పాఠ శాలకు, వికారాబాద్‌కు మంచి పేరు తెచ్చి పెట్టారు. వివిధ రంగా ల్లో ఉద్యోగాలు పొందారు. సరైన వసతులు కల్పించి విద్యార్థులకు విద్య నందిస్తు న్నాయి. మారుమూల ప్రాంతాల విద్యార్థులు సైతం ప్రభుత్వం అందించే గురుకు లాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. విద్యా విధానంలో చాలా మార్పులు జరిగాయి.
– డి. గోపాల్, పట్టణవాసి వికారాబాద్