Vikarabad | దోమ, జూన్ 26 : పారిశుద్ధ్య కార్మికుల ముందస్తు అరెస్టులు సిగ్గుచేటని కార్మిక సంఘం సభ్యులు మండిపడ్డారు. కార్మికులు చేపట్టిన రాజభవన్ ముట్టడిని అడ్డుకోవడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. రాజ్ భవన్ ముట్టడి పిలుపు మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులను రాజభవన్ ముట్టడికి వెళ్లకుండా వారిని ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషనులకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులకు గత మూడు నెలలుగా జీతభత్యాలు లేవని మా కుటుంబాల జీవనం ఎలా గడవాలని వారు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు ఉన్నారు.