బొంరాస్‌పేట, ఏప్రిల్ 2 : వికారాబాద్ జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. గతే డాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతు న్నాయి. రానున్న రోజుల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఏవైనా అవాంతరాలు ఏర్పడి తే దానిని అధిగమించేందుకు.. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం జిల్లాకు 9.22 కోట్లు మంజూరు చేసింది. వీటిలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిధులు రూ.3 కోట్లు కాగా, ప్రత్యేక అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్) రూ.6.22 కోట్లు ఉన్నాయి. ఈ నిధుల తో పంపుసెట్లు, ప్యానల్ బోర్డులు, చేతిపంపులకు మరమ్మతులు, మిషన్ భగీరథ పథకం లో వేసిన పైపులైన్లు పగిలితే రిపేర్లు చేయడం, లీకేజీలను అరికట్టడం, సింగిల్‌ఫేస్, త్రీ ఫే స్ విద్యుత్ మోటర్లకు మరమ్మతులు వంటి తదితర పనులను చేపట్టాల్సి ఉంటుంది. అవసరమైతే వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకుని ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని 20 మండలాల్లో 776 పనులను అధికారులు గుర్తించారు. వీటికోసం రూ.3 కోట్లు ఖర్చు చేయనున్నారు.
మండలాల వారీగా మంజూరైన నిధులు
తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లాలోని 20 మండలాలకు మంజూరైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. ధారూరు మండలంలో 42 పనులకు రూ.16.27 లక్షలు, మోమిన్‌పేట లో 27 పనులకు రూ.9.40లక్షలు, మర్పల్లిలో 29 పనులకు 12.51లక్షలు, నవాబు పే టలో 27పనులకు 13.90 లక్షలు, వికారాబాద్‌లో 21 పనులకు రూ.10.60లక్షలు, పరిగిలో 46 పనులకు రూ.17.15లక్షలు, పూడూరులో 38 పనులకు రూ.17.60లక్ష లు, కోట్‌పల్లిలో 21 పనులకు రూ.13.25 లక్షలు, బంట్వారంలో 14 పనులకు రూ.11. 60 లక్షలు, యాలాలలో 50 పనులకు రూ.17.70లక్షలు, పెద్దేముల్లో 48 పనులకు రూ.17.65లక్షలు, కొడంగల్‌లో 34 పనులకు రూ.16.21లక్షలు, దౌల్తాబాద్‌లో 50 పనులకు రూ.15.74లక్షలు, దుద్యాలలో 42పనులకు 12.66లక్షలు, బొంరాస్‌పేటలో 75 పనులకు రూ.25.38 లక్షలు, బషీరాబాద్‌లో 29 పనులకు రూ.12.20 లక్షలు, తాండూరులో 42 పనులకు రూ.15.70లక్షలు, దోమలో 50 పనులకు రూ.15.25 లక్షలు, కులకచర్లలో 53 పనులకు రూ.15.10లక్షలు, చౌడాపూర్ మండలంలో 38 పనులకు రూ.14.14 లక్షలు నిధులు మంజూరయ్యాయి.
ఎస్డీఎఫ్ నిధులు రూ.6.22 కోట్లు మంజూరు
ప్రతి నియోజకవర్గానికీ ప్రభుత్వం అభివృద్ధి పనుల నిమిత్తం రూ.10 కోట్ల చొప్పున నిధు లను మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి తాగునీటి అవసరాలకోసం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 342 పనులను చేపట్టేందుకు రూ.6.22 కోట్లను మంజూరు చేసింది. కొడంగల్ నియోజవర్గానికి 134 పనులకు రూ.2.74 కోట్లు, పరిగికి 121 పనులకు రూ.98లక్షలు, తాండూరుకు 34 పనులకు రూ.కోటి, వికారాబాద్ నియోజకవ ర్గానికి 53 పనులకు రూ.1.50కోట్లను మంజూరు చేసింది. గ్రామాల్లో ఎక్క డెక్కడ మంచి నీటి సమస్యలు ఉన్నాయో గుర్తించి ఈ నిధులతో అధికారులు పనులు చేపడుతున్నారు.