షాబాద్/మొయినాబాద్, ఏప్రిల్ 12 : తెలంగాణలో కేసీఆర్ పేరు చేరిపేయడం రేవంత్‌రెడ్డి తరం కాదని .. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ పదం వినిపిస్తున్నంతకాలం కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మొయినాబాద్ మండలంలోని స్టార్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన చేవెళ్ల నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సబితారెడ్డి హాజరై కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల పండుగను జరుపుకోనున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ఏమి చేశారని కొందరూ మూర్ఖులు మాట్లాడుతున్నారని, తెలంగాణ వచ్చేందుకు 14 ఏండ్లు ఏ విధంగా కష్టపడారో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఆ సమయంలో ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కసిగా పనిచేసి రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు. 14 ఏం డ్లు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా నడిపించారు.. రాష్ర్టాన్ని సాధించి.. పదేండ్లు పాలన ఎలా చేశారో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ఏమి చేశా రు.. రేవంత్‌రెడ్డి ఏమి చేస్తున్నాడో ప్రజలకు స్పష్టంగా అర్థమై పోయిందన్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికెళ్లి ప్రజలను కదిలించినా కేసీఆర్‌ను ఓడించి చాలా తప్పు చేశామని చెబుతున్నారని.. 16 నెలల కాంగ్రెస్ పాలనతో ప్రజలందరూ చాలా విసిగిపోయారన్నారు.
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిప డ్డారు. అరకొరగా పంట రుణాలను మాఫీ చేయడంతోపాటు అన్నదాతలకు రైతుభరోసా ఎగ్గొట్టాడని.. తులం బంగారం ఊసే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. పొద్దున లేవగానే తాగేందుకు గ్లాసులో నీటిని పట్టుకోగానే మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ కనిపిస్తారని, ఊర్లలో కనిపించే పచ్చని చెట్లను చూస్తే కేసీఆర్ తీసుకొచ్చిన హరితహారం గుర్తుకొస్తుందన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అధినేత చేసిన పనులే కనిపిస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని.. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని అంటున్నాడని.. అది ఆయనకు సాధ్యం కాదన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ పదం వినిపిస్తున్నంతకాలం కేసీఆర్‌ను ఎప్పటికీ ప్రజలు మరిచిపోరన్నారు. 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు అన్ని వర్గాల వారు అధిక సంఖ్యలో తరలివచ్చి సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా మన ఇంట్లో పం డుగ జరిగితే ఎలా వెళ్తామో అలాగే.. దండు లా తరలిరావాలన్నారు. మీటింగ్‌కు వెళ్లే వాహనాల్లో ఎక్కేటప్పుడు పండుగ వాతావరణంలో ర్యాలీగా వెళ్లి ఎక్కాలన్నారు.
ప్రతి బస్సుకూ ఆయా గ్రామాలకు సంబంధించిన పేర్లతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుని, వాటిపై డ్రైవర్ల ఫోన్ నంబర్లు వేయించాలన్నారు. కార్యకర్తలకు ప్రతి బస్సులోనూ తాగునీరు, భోజనం అందించాలన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల నుం చి 100 బస్సులు, 300 కార్లలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులు అధికంగా తరలిరావాలన్నా రు. ఎక్కడికెళ్లినా చేవెళ్లకు ఒక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలోనూ వాల్‌రైటింగ్‌లు రాయించాలన్నారు. సోషల్ మీడియా వాళ్లు యాక్టివ్‌గా పనిచేయాలన్నారు. త్వరలోనే ఉప ఎన్నిక రానున్నదని.. ముందుగా చేవెళ్లనే గెలిపించుకు రావాలని కేసీఆర్ చెప్పారన్నారు. ఉప ఎన్నికతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో నూ బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఏ ఒక్క హామీని అమలు చేయక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడు తున్నారు. తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. అన్ని వర్గాలకు అండగా నిలిచారు. ఈ నెల 27న జరిగే వరంగల్ సభకు ప్రతి గ్రామం నుంచి భారీగా సంఖ్యలో తరలివెళ్లి సభను సక్సెస్ చేసి..కాంగ్రెస్ సర్కార్‌కు వణుకుపుట్టిద్దాం.
-కొంపల్లి అనంతరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు
మనం కష్టపడి గెలిపించిన వారే.. మన కార్యకర్తలను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్నీ ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు. పార్టీ మారిన వారి గురించి పట్టించుకోవద్దు. బీఆర్ఎస్కు కార్యకర్తలే బలం. ఈ నెల 27న వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఊరూవాడా.. ఒక్కటై కదిలి సక్సెస్ చేద్దాం. రేవంత్ సర్కార్ అలవి కాని హామీలిచ్చి.. పవర్లోకి వచ్చాక ప్రజలందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఒక్క హామీని కూడా ఇప్పటివరకు సక్రమంగా అమలు చేయలేదు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ర్టానికి, ప్రజలకు న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ అధినేతతోనే అభివృద్ధి సాధ్యం
-పట్నం అవినాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు