కందుకూరు, డిసెంబర్ 12 : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని అగర్మియాగూడ గ్రామానికి చెందిన యువకులు, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి నీరటి శివరంజిని సహా అనేక మంది మహిళలతో కలిసి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి సబితా ఇంద్రారెడ్డి పార్టీ కండువాలను కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతును తెలుపుతున్న అబ్యర్థుల విజయం కోసం నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని కోరారు.
పార్టీలో చురుకుగా పని చేస్తున్న వారికి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను ఎండగట్టాలని కోరారు. 6గ్యారంటీల ఊసై లేదని హామీలపై మాట్లాడడం లేదని పేర్కొన్నారు. హామీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుగారులు గెలిపించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరారు.
కార్యక్రమంలో మార్కెట్ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్,మాజీ సర్పంచ్ ఈర్లపల్లి భూపాల్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్‌రెడ్డి,ఆదీబ్ ఆహమ్మద్, గద్దగూటి యాదగిరి, నీరటి అంజయ్య, రమేశ్, లక్ష్మమ్మ, కవిత, జయమ్మ, శ్రావణ్ కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, రేహనా సుల్తాన్, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.