కందుకూరు, ఏప్రిల్ 14 : దళితులకు ఇచ్చిన హామీని రేవంత్ సర్కార్ మరిచిపోయిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మండలంలోని కొత్తూరు చౌరస్తాలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందన్నారు. దళితులకు ఇచ్చిన హామీలు 16 నెలలు గడిచినా ఇంకా అమలు కాలేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఇందిరమ్మాదేవేందర్, దశరథ, చంద్రశేఖర్, మేఘనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.