Motor Driving Schools | శంషాబాద్ రూరల్ ఫిబ్రవరి 16: ఆర్టీఏ నిబంధనలు తమకు వర్తించవంటూ డ్రైవింగ్ స్కూల్స్ (Motor Driving Schools) నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్‌కు వినియోగిస్తున్న వాహనాల స్థితిపై అధికారులు నిఘా పెట్టకపోవడంతో శంషాబాద్‌లో డ్రైవింగ్ శిక్షణ నిర్వాహకులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. రికార్డుల్లో పేర్కొన్న నెంబర్ కలిగిన వాహనం రోడ్లపై కనిపించదు. రవాణా శాఖ నుంచి ఒక వాహనాకి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఒక వాహనం పర్మిషన్ మీద పదుల సంఖ్యలో వాహనాలు నడుపుతూ ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. శిక్షణ కేంద్రాల నిర్వహకులు మొదట పది రోజులపాటు సిమ్లేటర్పై నేర్పించాల్సి ఉంటుంది. తర్వాత ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాలి. ఇలా కాకుండా నేరుగా కార్ ఎక్కించి తక్కువ సమయంలో ఎక్కువ మందికి శిక్షణ ఇస్తున్నారు.
ఇష్టానుసారంగా ఫీజులు..
కరోనా తర్వాత ప్రైవేట్ వాహనాల వినియోగం అధికమైంది. కార్ల అమ్మకాలు అధికంగా పెరగడంతో ఆడ, మగ తేడా లేకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ఇష్టాన్ని ఆసరాగా చేసుకుని శిక్షణ కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటూ.. పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకుండానే, రోడ్డు భద్రత సూచికలపై అవగాహన కల్పించకుండా లైసెన్సులు ఇ ప్పిస్తున్నారు. ఈ కారణంగా రోడ్డుపై ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
ఉమ్మడి జిల్లాలో తనిఖీలు చేపట్టకపోవడంతో అంతా తమ ఇష్టమని శిక్షణ కేంద్ర నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలకమైన డ్రైవింగ్ శిక్షణ పై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. అనుమతి లేని డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ ఇస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పిర్యాదు చేసిన వారికి.. కానిస్టేబుల్ బెదిరింపు
శంషాబాద్‌లో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మోటార్ డ్రైవింగ్ స్కూల్స్ పై అధికారులకు ఫిర్యాదు చేసిన వారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్