పెద్దఅంబర్‌పేట, మే 19 : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 238లోని ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలు మంజూరుచేయాలని దళిత యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గ్యార నర్సింహ కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌరెల్లిలోని సర్వేనంబర్ 238లో మిగిలిపోయిన ప్రభుత్వ స్థలం నుంచి ఇండ్లు లేని నిరుపేదలకు 120 గజాల జాగా కేటాయించి, పట్టాలు ఇవ్వాలని కోరారు.
ఇదే సర్వే నంబర్లో వైఎస్ఆర్ హయాంలో 1500 మంది ఇండ్ల పట్టాలు సర్టిఫికెట్లు ఇచ్చారని, వీరిలో 91 మంది ఇండ్లు నిర్మించుకుని ఉంటున్నారని తెలిపారు. మిగతావారి వద్ద పట్టా సర్టిఫికెటు ఉన్నా.. వారికి జాగా చూపించలేదన్నారు. అధికారులు స్పందించి నిరుపేదలకు పట్టా జాగాలతోపాటు ఆర్థికసాయం అందించి ఇండ్లు నిర్మించుకునేందుకు సహకరించాలని కోరారు.