షాద్‌నగర్ : రోడ్డుపై వెళ్తున్న ఓ టిప్పర్ అదుపు తప్పి రోడ్డు సమీపంలో ఉన్న కిరాణ షాపులోకి దూసుకెళ్లిన ఘటన ఫరూఖ్‌నగర్ మండలం బుచ్చిగూడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వెల్జర్ల వైపు నుంచి షాద్‌నగర్ వైపు వస్తున్న ఓ టిప్పర్ వాహనం అదుపు తప్పి రోడ్డు సమీపంలో ఉన్న కొమటి కృష్ణయ్యకు చెందిన కిరాణం షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో గ్రామస్తులు ఊపిరిపిల్చుకున్నారు.
టిప్పర్ డ్రైవర్ ఆ జాగ్రత్తతో వాహనం నడుపడం వలనే టిప్పర్ షాపులోకి దూసుకొచ్చిందని గ్రామస్తులు తెలిపారు. టిప్పర్ ఢీకొని షాపు ముందు నిర్మించిన రేకుల షెడ్ ధ్వంసమైందని బాధితుడు వాపోయాడు.