చివరి స్థానాల్లోనే
పదోతరగతి ఫలితాల్లో జిల్లా 31వ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన రిజల్ట్స్‌లో జిల్లా ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. వరుసగా నాలుగో ఏటా కూడా చివరి స్థానంలోనే నిలిచింది. అయితే గతేడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయి.
- విడుదలైన టెన్త్ ఫలితాలు
- మెరుగుపడని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ర్యాంక్
- రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో 30వ, వికారాబాద్ జిల్లా 31వ స్థానంలో..
- వికారాబాద్ జిల్లాను పట్టించుకోని సీఎం రేవంత్‌రెడ్డి
వికారాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి ఫలితాల్లో జిల్లా 31వ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన రిజల్ట్స్‌లో జిల్లా ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. వరుసగా నాలుగో ఏటా కూడా చివరి స్థానంలోనే నిలిచింది. అయితే గతేడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయి. గతేడాది 33వ స్థానంలో నిలిచిన జిల్లా, ఈ ఏడాది 31వ స్థానంలో ఉన్నది. గతేడాది 73 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఫలితాల్లో 91.25 శాతం సాధించింది. జిల్లాలో 13,482 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకాగా 12,302 మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణులయ్యారు.
మరోవైపు ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. జిల్లా లో 6,729 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 5,955 మంది ఉత్తీర్ణులుకాగా, బాలికలకు సంబంధించి 6,753 మం ది పరీక్షలకు హాజరుకాగా 6,347 మంది పాస్ అయ్యారు. బాలికలు 93.99%, బాలురు 88.5% మంది ఉత్తీర్ణులయ్యారు. జూన్ 5 నుంచి 12 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు మే 14 వరకు గడువు ఇచ్చారు. మార్కుల రీ కౌంటింగ్, ఈ-వెరిఫికేషన్‌కు రేపటి నుంచి మే 14 వరకు ప్రభుత్వం గడువిచ్చింది.
సీఎం జిల్లాలో విద్యాశాఖ నిర్లక్ష్యం
టెన్త్ ఫలితాల్లో సీఎం సొంత జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఫలితాల్లో జిల్లా వెనుకబడిందనే విమర్శలున్నాయి. వరుసగా మూడేండ్లు 33వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 31వ స్థానంతో సరిపెట్టుకున్నది. ప్రతి ఏటా టెన్త్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతోనే మెరుగైన ఫలితాలను సాధించలేకపోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతేడాది కంటే ఉత్తీర్ణతాశాతం 15 శాతం మేర పెరిగిందని చెప్పుకోవడం తప్ప అధికారులు పెద్దగా చేసేదేమీ లేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో డిసెంబర్ నుంచచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితాలను మాత్రం రాబట్టలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై మొదటి నుంచి దృష్టి సారించకుండా కేవలం పరీక్షల సమయంలోనే ఉత్తీర్ణుల్యేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చారని జిల్లా విద్యాశాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

