తాండూరు, డిసెంబర్17 : కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత ధోరణికి వ్యతిరేకంగా తాండూరు నియోజకవర్గంలో శనివారం బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపట్టారు. రాస్తారోకోలు, ధర్నాలతో గ్రామాలు, పట్టణాలు హోరెత్తాయి. ఊరూరా ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే నిలుస్తారన్నారు. బీజేపీకి అమ్ముడు పోకుండా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటిన రోహిత్‌రెడ్డిని ఇరకాటంలో పెట్టే కుట్ర ఫలితమే ఈడీ నోటీసులన్నారు. మోదీ, ఈడీలకు భయపడేది లేదన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో బీజేపీలో వణుకు మొదలైందని, అందుకే ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నదని ఘాటుగా విమర్శించారు. బీజేపీ విద్వేషపూరిత కుట్రలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే నిలుస్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఇచ్చిన ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో మోదీ, బండి సంజయ్ దిష్టి బొమ్మల దహనంతో నియోజక వర్గం అట్టుడికింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ స్థాయిలో నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలను నిర్వహించారు. తాండూరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అఫ్పూ నయీమ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్లో కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా మోదీ, బండి సంజయ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ కుట్ర పూరిత వైఖరిని బయట పెట్టినందుకు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై అక్కసుతో ఈడీ నోటీసులను ఇచ్చారన్నారు. బీజేపీ విద్వేషపూరిత కుట్రలకు ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఎన్ని ఈడీ దాడులు చేసినా బయపడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజూగౌడ్, నియోజకవర్గం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింహులు, శ్రీనివాస్ చారి, కౌన్సిలర్ మంకాల రాఘవేంధర్, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు హరిహరగౌడ్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, బసప్ప, కరుణాకర్, ఇంతియాజ్, మోయిజ్ పాల్గొన్నారు.
తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కృషి
పెద్దేముల్ : మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నరేంద్రమోడీ, బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్‌చారి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, పార్టీ నాయకులు టి.రమేశ్, గోపాల్‌రెడ్డి, రుద్రారం గోపాల్‌రెడ్డి, శిబ్లి, ముకుంద్ రెడ్డి, రవి, రాంరెడ్డి, ఉపేందర్, మాణిక్యం, చందర్, డివై ప్రసాద్, వెంకట్, శశి, బంగ్ల రఘు, రమేశ్, అరుణ్, సమృద్ధి, రాములు, మునీర్, చంద్రశేఖర్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేపై కక్షకట్టిన కమలం పార్టీ
బషీరాబాద్ : బీజేపీ కుట్రలను బయటపెట్టిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై కమలం పార్టీ కక్ష కట్టిందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామునాయక్, పీఏసీఎస్ చైర్మన్ అల్లాపురం వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడంతో మండలంలోని నాయకులు, కార్యకర్తలు శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేసి, నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్సింగ్తన్వార్, మహిళా అధ్యక్షురాలు జయమ్మ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
గౌతాపూర్ చౌరస్తాలో నరేంద్రమోదీ దిష్టి బొమ్మ దహనం
తాండూరు రూరల్ : బీఆర్ఎస్ పార్టీ తాండూరు మండలం అధ్యక్షుడు రాందాస్ ముదిరాజ్, నాయకులు ఉమాశంకర్, నియోజకర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశ్‌పాండే, ఉమ్మడిరంగారెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి శనివారం ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ, గౌతాపూర్ రోడ్డు పై ధర్నా చేసి, ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాములు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కోట్‌పల్లి మండల కేంద్రంలో..
కోట్‌పల్లి, డిసెంబర్ 17 : ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం కోట్‌పల్లి మండల కేంద్రంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు పలువురు నాయకులతో కలిసి మోదీ, బండి సంజయ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో..
యాలాల, డిసెంబర్17 : ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చిన కారణంగా బీఆర్ఎస్ పార్టీ మండల శ్రేణులు శనివారం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో రాస్తారోకోను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర గుప్తా, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రమేశ్, కోఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, సర్పంచ్‌లు మధుసూదన్‌రెడ్డి, పటేల్‌రెడ్డి, నాయకులు అమర్నాథ్రెడ్డి, ఉప సర్పంచ్‌లు నర్సింహులు, శేఖర్, కృష్ణ పాల్గొన్నారు.