
మొయినాబాద్, ఏప్రిల్ 19 : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని సర్పంచ్ గడ్డం లావణ్య అన్నారు. వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా సోమవారం గ్రామంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండో దశ కరోనా వైరస్ ప్రమాదకరంగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని సూచించారు.
కరోనా జాగ్రత్తలు తప్పనిసరి
కరోనా విస్తరించకుండా నియంత్రణ చర్యలు తప్పకుండా పాటించాలని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్, మార్కెట్‌యార్డు, బస్టాండ్‌లో సోమవారం సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేయించారు. మున్సిపాలిటీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. జాగ్రత్తలను పాటించని వారికి జరిమానా విధిస్తామని మునిపల్ చైర్మన్ హెచ్చరించారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
గ్రామాల్లో ప్రజలు ఎవరి పరిసరాలు వారే శుభ్రంగా ఉంచుకోవాలని సర్దార్‌నగర్ సర్పంచ్ మునగపాటి స్వరూప అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని సర్దార్‌నగర్‌లో పంచాయతీ సిబ్బందితో కాలనీల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. సెకండ్ వేవ్ భయంకరంగా ఉందని జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
చేవెళ్లలో 6 పాజిటివ్ కేసులు..
మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి కరోనా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మరో 23 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ దేవేందర్, శ్రీధర్, సాయికుమార్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
సీఎం కేసీఆర్‌కు కరోనా.. త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్
రోగనిరోధక శక్తి పెరగాలంటే.. పసుపు పాలు తాగాల్సిందే
భారత్‌ను ట్రావెల్ రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చిన బ్రిటన్