రోగనిరోధక శక్తి పెరగాలంటే.. పసుపు పాలు తాగాల్సిందే
Immunity | దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఇట్టే ఉపశమనం లభిస్తుంది.

రోజూ పాలు తాగే అలవాటు అందరికీ ఉంటుంది. అయితే, దానికి కాస్త మంచి పసుపు జోడిస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అని అంటున్నారు నిపుణులు. పాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడులోని కణాల ఆర్యోగానికి సహాయపడతాయి.
రోజూ మూడు గ్లాసుల పాలు తాగేవారు వ్యాధులకు దూరంగా ఉంటారని పలు పరిశోధనల్లోనూ తేలింది. అలాంటి సుగుణాలున్న పాలకు పసుపు తోడైతే ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు లభించినట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది పురాతన కాలం నుంచి ఉన్నదే. మన పూర్వీకులు కూడా పసుపు పాలను తాగేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉండేవారు.
దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను తాగితే ఇట్టే ఉపశమనం లభిస్తుంది. కఫం ఎక్కువగా ఉండి ఇబ్బందిపడేవారు వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. పాలలో సెరటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దానివల్ల హాయిగా నిద్ర పడుతుంది.
మరిన్ని ప్రయోజనాలు..
- రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.
- పసుపు పాలు వైరల్ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి. కాబట్టి కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు రావు.
- కాలేయంలో చేరే విషకారకాలను హరిస్తుంది.
- ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గిస్తుంది.
- కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పక తాగాలి.
- పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫోటిక్ సిస్టమ్‌ను కూడా శుద్ధిచేస్తాయి.
- కామెర్లు దరిచేరకుండా అరికడుతుంది.
- పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరంలో వైరస్ వృద్ధిని అరికడుతుంది.
- నీటి ద్వారా శరీరంలోకి చేరుకున్న వైరస్ త్వరితగతిన రెట్టింపు అవకుండా పసుపు నియంత్రిస్తుంది.
- పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి.
- రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను దూరం చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఈ 8 చెడు అలవాట్లు మానుకోండి.. ఆయుష్షు పెంచుకోండి..!
వేధించే నోటిపూతకు సులువైన పరిష్కారం
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ సరిపోదా?
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

