ఈ 8 చెడు అలవాట్లు మానుకోండి.. ఆయుష్షు పెంచుకోండి..!
సాధారణంగా ప్రతీ ఒక్కరికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు మన ఆరోగ్యానికి చెడు చేసేది అయితే దాన్ని తొందరగా దూరం చేసుకోవడం ఉత్తమం

సాధారణంగా ప్రతీ ఒక్కరికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు మన ఆరోగ్యానికి చెడు చేసేది అయితే దాన్ని తొందరగా దూరం చేసుకోవడం ఉత్తమం. కొన్ని అలవాట్ల కారణంగా మనం త్వరగా వృద్ధాప్యంలోకి వెళ్లిపోతామంటున్నారు పరిశోధకులు. మనం నియంత్రించుకోగల అనేక అలవాట్లు ఉన్నాయని సెలవిస్తున్నారు నిపుణులు.
ఒకేసారి ఎక్కువ పనులు, ధూమపానం, ఎక్కువ తీపి ఆహార పదార్థాలు తినడం, నిద్రకు దూరమవడం, ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వంటి అలవాట్ల వల్ల మానవులు 10 నుంచి 13 సంవత్సరాల వయసును కోల్పోతున్నారని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు నివేదించారు. మన వయసును తగ్గించే ఎనిమిది అలవాట్ల గురించి తెలుసుకుందాం.
ఎక్కువ పని గంటలు : రోజులో ఎక్కువ పని గంటల ఉద్యోగం చేయడం ద్వారా జీవితకాలం 8 సంవత్సరాలకు తగ్గుతుంది. ఒకేసారి ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కలిగే ఒత్తిడి శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
తక్కువగా నిద్ర : రోజూ 7 గంటలపాటు నిద్రించడం అవసరం. తక్కువ నిద్రపోవడం మనస్సును అలసిపోయేలా చేస్తుంది. శరీరం బరువును పెంచుతుంది. ప్రాణాంతకం కూడా. నిద్ర సక్రమంగా లేకపోవడం జీవితం తగ్గిపోతుంది.
ఎక్కువ సేపు కూర్చోవడం : ఎక్కువసేపు కూర్చునే వారిలో మూత్రపిండాలు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామంతో దీనిని నివారించుకోవచ్చు.
ధూమపానం వద్దే వద్దు : ధూమపానం పొడిబారిన చర్మానికి కారణమవుతుంది. ముఖం మీద ముడతలు వస్తాయి. శరీరంలో విటమిన్ సీ స్థాయి తగ్గుతుంది. ఫలితగా చర్మం తేమను నిర్వహించదు. ధూమపానం ఒక వ్యక్తి వయస్సును 10 సంవత్సరాలు తగ్గిస్తుంది.
హెడ్‌ఫోన్స్‌లో పెద్ద శబ్దంతో వినడం : హెడ్‌ఫోన్స్ వినియోగించి ఎక్కువ శబ్దంతో సంగీతం, పాటలు వినే వ్యక్తులకు వినికిడి సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. హెడ్ఫోన్లలో అధిక పరిమాణంలో వినడం చాలా హానికరం. వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతాయి.
అలంకరణ వస్తువులతో జాగ్రత్త : ఎక్కువ వాసన, రసాయనంతో కూడిన అలంకరణ ఉత్పత్తుల్లో ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలో దురదకు కారణమవుతుంది. దీనివల్ల ముఖం మీద ముడతలు వస్తాయి. మనం కోరుకుండానే వృద్ధాప్యం ముంచుకొస్తుంది.
తీపి వస్తువులకు బైబై : ఎక్కువ తీపి వస్తువులు తినడం మానుకోవాలి. వీటి కారణంగా శరీరం బరువు పెరుగుతుంది. వయస్సు తగ్గుతుంది. చక్కెర అణువులు చర్మ కణాలను కఠినంగా మారుస్తాయి.
ఫాస్ట్‌ఫుడ్ తినడం : ఫాస్ట్‌ఫుడ్ కొవ్వును పెంచుతుంది. వీటిని తరుచుగా తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి మన వయస్సును ఆరు సంవత్సరాలకు తగ్గిస్తుంది.
ఇవి కూడా చదవండి..
మీ కాలేయాన్ని ఇలా ఆరోగ్యంగా ఉంచుకోండి.. ఇవాళ వరల్డ్ లివర్ డే
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్‌లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్‌లో లాక్‌డౌన్‌కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
అంతరిక్షంలోకి ఆర్యభట్ట.. చరిత్రలో ఈరోజు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

