కొడంగల్ : ఎమ్మెల్యే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కొడంగల్‌లో టీఆర్ఎస్ అఖంఢ విజయం సాధించి మూడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి నియోకవర్గ టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్‌రెడ్డి ఎన్నికతో కొడంగల్ అభివృద్ధికి నాంది ఏర్పడిందని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపై జోరుగా అభివృద్ధి పనులు కొనసాగి అన్నింటా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి అనుదినం ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి ఎంతో పాటుపడుతున్నారని, ప్రజల హృదయాల్లో ప్రజా నాయకుడిగా నిలిచిపోయినట్లు తెలిపారు.
గతంలో ఏ నాయకుడు ఈ తరహాల్లో ప్రజా సంక్షేమానికి పాటుపడలేదని, కాబట్టే ప్రజలు ఎమ్మెల్యే వెంట ఉంటూ దిగ్విజయంగా మూడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా ఆదరిస్తున్న ప్రజలకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరోత్తంరెడ్డి, మడిగె శ్రీను, శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.