నందిగామ : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేసి క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నోముల పద్మారెడ్డి ఆధ్వర్యంలో రంగాపూర్, అప్పారెడ్డిగూడ, తళ్లగూడ గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నికల ఇన్చార్జి పెంటనోళ్ల యాదగిరి, రాజవరప్రసాద్, జంగయ్య, నవీన్‌కుమార్‌ల అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. రంగాపూర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఆకుల గణేశ్, కార్యదర్శిగా గోవు నర్సింహులు, అప్పారెడ్డిగూడ అధ్యక్షులుగా దివిటి నర్సింహులు, కార్యదర్శిగా బండి నర్సింహులు, తళ్ళగూడ అధ్యక్షులుగా ఆలురి రంగయ్య, కార్యదర్శిగా కుడుముల ఆనంద్‌గౌడ్, ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ హాజరై సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డితో కలిసి కమిటీ సభ్యులకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుంద న్నారు. టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందించే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్‌లు నర్సింహులు, రమేశ్‌గౌడ్, అశోక్, మహిళ నాయకురాలు రాజ్యలక్ష్మి, నాయకులు కుమార్‌గౌడ్, గోవు రవి, భాస్కర్, శ్రీశైలం, శ్రీకాంత్, వీరచారి, చెన్నయ్య, ఆంజనేయులు, విజయ్ పాల్గొన్నారు.