కడ్తాల్, ఫిబ్రవరి 25 : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, సీడీపీ నిధులు రూ.3 లక్షలతో ముద్విన్ గ్రామం నుంచి మల్లప్ప గుట్ట వరకు చేపట్టిన మట్టి రోడ్డు పనులు, రూ.5 లక్షలతో ముద్విన్ గ్రామం నుంచి ఫిరోజ్‌నగర్ వరకు నిర్మించనున్న మట్టి రోడ్డు పనులను సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ నిర్మలదేవి, ఉప సర్పంచ్ వినోద్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. పల్లెల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో కొత్త శోభ సంతరించుకున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. ముద్విన్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమెరికా తెలుగు సంఘం సహకారంతో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
బ్రిడ్జి నిర్మించాలని వినతి.. ముద్విన్ గ్రామ సమీపంలో ముద్విన్-ఆకుతోటపల్లి రహదారిపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని కోరుతూ ముద్విన్ గ్రామస్తులు ఎమ్మెల్యే జైపాల్యాదవ్కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు యాదయ్య, లక్ష్మీనర్సింహారెడ్డి, భారతమ్మ, ఉప సర్పంచ్ వినోద్, టీఆర్ఎస్ మండల, గ్రామాధ్యక్షులు పరమేశ్, రాజు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, నాయకులు రాఘవరెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింహ, గోపాల్, వెంకట్‌యాదవ్, జంగయ్యయాదవ్, నర్సింహగౌడ్, లాలయ్యగౌడ్, మహేశ్ పాల్గొన్నారు.