బొంరాస్‌పేట, మే 24: దళితుల జీవితాల్లో మార్పు తేవడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని చిల్ముల్మైలారం గ్రామానికి చెందిన గుండ్లపల్లి వెంకటయ్యకు దళితబంధు పథకం కింద మంజూరైన బొలెరో వాహనాన్ని కొడంగల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుడికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్రం లభించి 75 ఏండ్లవుతున్నా దళితుల అభివృద్ధిని ఏ పార్టీ పట్టిం చుకోలేదని, దళితులు ఆర్థికంగా అభివృద్ధిచెందాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ ఏడాది నియోజకవర్గంలోని 1500 మందికి దళిత బంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ పథకాన్ని దళితులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప, బొంరాస్‌పేట పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
ళితుల అభ్యున్నతికి అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ద్యాచారం గ్రామానికి చెందిన యాదయ్యకు ట్రాక్టర్‌ను అంద జే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అర్హులైన నిరుపేదలకు రూ.10లక్షలు అందించి, వారిని ఆర్థికంగా అభివృద్ధిపరుస్తున్నారని తెలిపారు. ఈ పథకాన్ని సద్వి నియోగం చేసుకొని ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ ఆంజనేయులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.