కేశంపేట, ఫిబ్రవరి 26 : పిల్లలు కష్టపడి చదువుకుంటేనే రాబోవు రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట పాఠశాలలో దివ్యశక్తి రౌండ్ టేబుల్ ఇండియా 134 వారు నిర్మించిన అదనపు తరగతి గదులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, బోధన జరుగుతున్నదని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. సామాజిక బాధ్యత కింద దివ్యశక్తి రౌండ్ టేబుల్ ఇండియా 134 వారు గ్రామంలో పాఠశాల భవనాన్ని నిర్మించి విద్యాభివృద్ధికి తోడ్పాటునందించడంపై సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దివ్య శక్తి రౌండ్ టేబుల్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ రవీందర్‌యాదవ్, జడ్పీటీసీ విశాల, ఇన్చార్జి ఎంఈవో మనోహర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్‌నాయక్, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.