కడ్తాల్, ఫిబ్రవరి 26: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తాతో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ఆలయా ల అభివృద్ధికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదన్నారు. అనంతరం ఆయన మైసమ్మతల్లి ఆలయ చరిత్రను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయన్ను శాలువా, పూలమాలతో ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ ఎండీ మీనా, ఏడీఏ వెంకట్రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సత్యం, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వీరయ్య, సర్పంచ్ తులసీరాంనాయక్, ఉప సర్పంచ్‌లు రామకృష్ణ, రాజు, నాయకులు మహేశ్, రాజు, శ్రీకాంత్, రమేశ్, పీఏసీఎస్ సీఈవో దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి, ఫిబ్రవరి 26: రైతులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించి అధిక లాభాలను పొందాలని రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చెర్మన్ కేశవరెడ్డితో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలోనే మొట్టమొదటి శనగల కొనుగోలు కేంద్రాన్ని తలకొండపల్లి మండలంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందన్నారు. వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా పప్పుదినుసులు, నూనెగింజ పంటలను సాగు చేయాలని రైతుల ను సూచించారు. వాణిజ్య పంటల సాగుతో అధిక లాభా లను పొందొచ్చన్నారు. అనంతరం ఆయన పరిసర ప్రాం తాల రైతులు సాగుచేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు వచ్చేలా చూస్తున్నామని.. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఆర్ డీఈ వెంకటరమణారెడ్డి, చెర్మన్ కేశవరెడ్డి, సర్పంచ్‌లు రమేశ్, శ్రీశైలం, సీఈవో ప్రతాప్‌రెడ్డి, ఉపసర్పంచ్ తిరుపతి, ఆంజనేయులు, కృష్ణ, మల్లేశ్, యాదగిరి, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని దేవునిపడకల్ గ్రామంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీశైలంతోపాటు గ్రామస్తులు వారికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.