మొయినాబాద్, ఫిబ్రవరి 24 : ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, వైస్ ఎంపీపీ మమతతో కలిసి 63 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అడగని పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. దళితులను ధనికులుగా మార్చాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అర్హులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, ఎంపీడీవో సంధ్య, డీటీ ఎండీ తాజుద్దీన్, ఆర్ఐలు పాండు, చంద్రమౌళి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంజుల, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దారెడ్డి శోభ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ సురేందర్‌గౌడ్, ఎంపీటీసీ అర్జున్, మోత్కుపల్లి ఉప సర్పంచ్ కిరణ్, మల్లేశ్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, యాత్ మండల అధ్యక్షుడు పరమేశ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దారెడ్డి వెంకట్‌రెడ్డి, రాజు, అంజయ్యగౌడ్ పాల్గొన్నారు.