పరిగి, మార్చి 8: గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత నివారణకు వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లను అందించేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిన సందర్భంగా వికారాబాద్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, జిల్లాలోని అధికారులు మంగళవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో సబితారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణులను మంత్రి సన్మానించారు.