కడ్తాల్, మార్చి 5: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నా యి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి క్రమం తప్పకుండా నిధులను కేటాయిస్తున్నది. మండలంలోని చల్లంపల్లి సర్పంచ్, పాలకవర్గ సభ్యులు వాటిని సద్వినియోగం చేసుకుని గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. గ్రామంలో 455 ఇండ్లు ఉండగా, 1,780 మంది జనాభా, 1,410 మంది ఓటర్లు ఉన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలుకు ముందు గ్రామమంతా చెత్తాచెదారం, మురుగుతో చిత్తడి ఉండేది. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామానికి కొత్త కళ వచ్చింది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, డంపింగ్ యార్డు, ట్రాక్టర్, ట్యాంకర్‌తోపాటు సీసీ రోడ్లను ఏర్పాటు చేశారు. పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ గ్రామంలోని చెత్తాచెదారాన్ని సేకరించి పంచాయతీ ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ సేంద్రియ ఎరువును తయా రు చేసి మొక్కలకు వినియోగిస్తున్నారు. నిత్యం చెత్తను తొలగిస్తుండటంతో గ్రామం పరిశుభ్రంగా కనిపిస్తున్నది. గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుండటంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పల్లెప్రగతితో చల్లంపల్లి గ్రామానికి కొత్త రూపు వచ్చింది. ఊరిలో రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్‌యార్డు, రూ.6 లక్షలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనంలో నాలుగు వేల మొక్కలను నాటారు. వాటిలో జామ, నిమ్మ, కొబ్బరి, తులసి, వేప, బాదం, ఉసిరి, దానిమ్మతోపాటు వివిధ రకాల పూల మొక్కలు ఉన్నాయి. రూ.కోటితో ఐదు వేల లీటర్ల సామర్థ్యం గల మినీ పాల శీతలీకరణ కేంద్రం, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని అందించేందుకు రూ.75 లక్షలతో వాటర్ ట్యాంక్, రూ.10 లక్షలతో అన్ని కాలనీల్లో ఎల్ఈడీ వీధిలైట్లను ఏర్పాటు చేశారు. చల్లంపల్లితోపాటు దాని అనుబంధ గ్రామమైన వంపుగూడెంలోనూ రూ.42 లక్షలతో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేశారు. పంచాయతీకి చెం దిన ట్యాంకర్‌తో ప్రతిరోజూ పల్లె ప్రకృతి వనంలోని మొక్కలకు నీటిని అందిస్తున్నారు. హరితహారంలో భాగంగా రోడ్డు కు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపు గా పెరిగి వృక్షాలుగా మారాయి. అవి ఆ రోడ్డులో రాకపోకలు సాగించే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలోని సీసీ రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంతో మురుగు సమస్య తీరింది.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రా మం అభివృద్ధి పథంలో ముం దుకు దూసుకెళ్తున్నది. సర్పం చ్, అధికారులు, వార్డు సభ్యు లు, ప్రజాప్రతినిధులు ప్రభు త్వ నిధులను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ విశేషంగా కృషి చేస్తున్నారు.
-ప్రవీణ్‌గౌడ్, చల్లంపల్లివాసి
గ్రామంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానికులు గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు. ప్రభు త్వం మంజూరు చేసే నిధులతో పక్కాగా అభివృద్ధి పనులను చేపడుతున్నాం. ఉన్నతాధికారుల సూచనల మేరకు గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం.
-రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి, చల్లంపల్లి
పల్లెప్రగతి నిధులతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఇప్పటికే ఊరిలో వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ సహకారంతో పాడి రైతుల సౌకర్యార్థం రూ. కోటితో మినీ పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటున్నాం.
-కృష్ణయ్యయాదవ్, చల్లంపల్లి, గ్రామ సర్పంచ్