Vikarabad | కులకచర్ల, మార్చి 25 : కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ సమీపంలోని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు. పాంబండ దేవాలయ కమిటి చైర్మన్ మైపాల్‌రెడ్డి, ఈవో బాలనర్సయ్య, కమిటి సభ్యులు, గ్రామ పెద్దలు, పూజారుల ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ ఘట్టమైన రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. అంతకు ముందు రాత్రి పార్వతీపరమేశ్వరుల కల్యాణం నిర్వహించిన భక్తులు స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రథోత్సవ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.