గ్యాస్ కనెక్షన్ ఈ- కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీలకు జనం పరుగులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల్లో ఒకటైన రూ. 500లకే సిలిండర్ పథకం వర్తించాలంటే కేవైసీ చేసుకోవాలన్న వదంతులతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చొని కేవైసీ పూర్తి చేసుకుంటున్నారు.
గ్యాస్ ఏజెన్సీల వద్దకు రావొద్దని, ఇంటివద్దకు డెలివరీ బాయ్ వచ్చినప్పుడే కేవైసీ చేసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నా జనం వినిపించుకోవడం లేదు. ఆమగనల్లు పట్టణంలోని హెచ్పీ గ్యాస్ కేంద్రం వద్ద గురువారం ఉదయం ప్రజలు ఇలా పెద్ద ఎత్తున క్యూలో నిలబడ్డారు. -ఆమనగల్లు, డిసెంబర్ 28