కొడంగల్, మార్చి 22 : రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని..అందులో అభివృద్ధి, సంక్షే మం శూన్యమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేండ్లు ప్రకటించిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి నోచుకోలేని.. ప్రస్తు తం ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్ కూడా అదే తీరులో ఉన్నదని ఆరోపించారు.
ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఉచిత బస్సు తప్ప మిగిలిన హామీలు అమలుకు నోచుకోలేదని ఎద్దేవా చేశారు. రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అరకొరగా అమలు చేస్తున్నదని.. రైతుబీమాకు రేవంత్ ప్రభుత్వం సున్నా చుట్టిందని..రైతు రుణమాఫీ కేవలం 30 శాతం మాత్రమే జరిగిందని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్ర భుత్వంలో రూ.2లక్షల కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రం అన్నిం టా అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని.. రైతులకు రైతుబంధు అందించి వ్యవసాయాన్ని పండుగలా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌తో రాష్ర్టానికి ఎటువంటి లాభం జరుగడంలేదని.. ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో.. ఏమి జరుగుతున్నదో సీఎం ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతుభరోసాను అందించే అంశాన్ని బహిరంగ సభల్లో గొప్పగా చెప్పుకోవడం సిగ్గు చేటని..గత మూడు పర్యాయాల రైతుభరోసా ఏమైందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోతున్నాయని.. గొప్పలు మాత్రం కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. గత కేసీఆర్ హయాంలో 100% ప్రజాసంక్షేమం, అభివృద్ధి జరిగిందన్నారు.
నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, మద్దూరు మండలాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, అధికారుల కనుసన్నల్లో ఇసుకదందా మూడు పూలు.. ఆరు కాయల్లాలా సాగుతున్నదని ఆరోపించారు ఇసుకదండాపై కాంగ్రెస్ సర్కార్ కొరడా ఝలిపిస్తుందని సీఎం చెప్పుకోవడం సిగ్గు చేటని.. ఆయన తన సొంత సెగ్మెంట్లోనే ఇసుక దందాను అరికట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లు, భూకబ్జాల పార్టీగా అభివర్ణించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ దయాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్‌రావు యాదవ్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి నర్మదాకిష్టప్ప, నవాజాద్దీన్, సముద్రమ్మ, వెంటకయ్య , చిన్న, రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.