కొడంగల్, జూలై 15 : సర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితాలో ఓట్లను కాపాడే బాధ్యత బీఎల్ఏలపైనే ఉందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో సర్ ప్రక్రియలో భాగం గా ఓటరు నమోదుపై బీఎల్ఏలతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుతూ.. సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించి సహకరించాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేట్ ఫాం అందిందా..? అందితే దానిని నింపి బీఎల్వోలకు అందించారా? లేదా పరిశీలించాలన్నారు.
కొడంగల్ పరిధిలో ఇప్పటివరకు 60 శాతం డిజిటలైజేషన్ పూర్తైందని.. మిగిలిన 40శాతాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. సామాన్యుడికి రెండు ఓట్లుంటే ఎన్నికల కమిషన్ చట్టపరంగా చర్యలు తీసుకొంటుందని.. అదే సీఎం రేవంత్‌రెడ్డికి నాగర్‌కర్నూల్‌లో ఒకటి, కొడంగల్‌లో మరొకటి ఈ విధంగా రెండు ఒట్లు ఉన్నాయని దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన 9 మోటర్లలో గతం లో ఒక్క మోటర్‌ను ప్రారంభించడం జరిగిందని.. మిగిలిన 8 మోటర్లలో కనీసం 5 మోటర్లు ప్రారంభిస్తే తాగునీటి, కరువు నుంచి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
గతం నుంచి మోటర్ల ప్రారంభంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉందని.. ఇప్పటికీ సీఎంకు బుద్ధి వచ్చి ఒక మోటరును ప్రారంభించారన్నారు. పాలమూరు-రంగారెడ్డి పనులను పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందన్న కక్షతోనే రేవంత్‌రెడ్డి ఆ ప్రాజెక్టును పక్కనబెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్‌రావు యాదవ్, మధుసూదన్‌రెడ్డి అడ్వకేట్, నవాజోద్దిన్, మల్లేశ్, రాజ్‌కుమార్, బలరాజు తదితరులు పాల్గొన్నారు.