జ్న్ మార్పుతో ఉద్యోగావకాశాలు
వికారాబాద్ జిల్లాను ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో వేశారని, చార్మినార్ జోన్లోకి మార్చడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
- అన్ని నియోజకవర్గాల్లో సమాన అభివృద్ధి
- వికారాబాద్ నుంచి మక్తల్ వరకు రైల్వే లైన్ మంజూరు చేయించుకున్నాం
- తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ వర్తింపు
- అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి
వికారాబాద్ జిల్లాను ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో వేశారని, చార్మినార్ జోన్లోకి మార్చడం వల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని పేర్కొన్నారు.
తాము ప్రతిపక్షంలో ఉండి వికారాబాద్ నుంచి పరిగి, కొడంగల్ నియోజకవర్గాల మీదుగా మక్తల్ వరకు రైల్వేలైన్ మంజూరు చేయించుకున్నామన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తామని, వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీని వర్తింపజేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు వయా పరిగి, కొడంగల్ మీదుగా జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
– పరిగి, డిసెంబర్ 16
పరిగి, డిసెంబర్ 16 : పరిగి నియోజకవర్గం పరిధిలోని గండీడ్, మహ్మదాబాద్ మండలాలు జోగులాంబ జోన్లో ఉన్నాయని, వాటితోపాటు కొడంగల్ నియోజకవర్గంలోని మండలాలను చార్మినార్ జోన్లోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డిని పరిగి ఎమ్మె ల్యే టి.రాంమోహన్‌రెడ్డి కోరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా శనివారం పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. వికారాబాద్ ప్రాం తాన్ని ఎక్కడో ఉన్న జోగులాంబ జోన్లో వేశారని, నిరుద్యోగుల కు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని, జోగులాంబ జోన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసి వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికీ పరిగి నియోజకవర్గంలోని గండీడ్, మహ్మదాబాద్ మండలాలు జోగులాంబ జోన్లో ఉన్నాయని, వాటితోపాటు కొడంగల్ నియోజకవర్గంలోని మండలాలను చార్మినార్ జోన్లోకి తీసుకురావాలని కోరారు. చార్మినార్ జోన్లో ఉండడంతో పరిగి ప్రాంతానికి చెందిన 47 మంది అభ్యర్థులు ఎస్సైలుగా ఎంపికయ్యారని తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

