పరిగి : పరిగి పట్టణం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి పట్టణంలోని 5వ వార్డులో రూ. 5లక్షలతో మురికి కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కాలనీలోనూ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రూ. 10కోట్లు ప్రత్యేక నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని చెప్పారు. పరిగి పట్టణాన్ని సుందర పట్టణంగా తీర్చిదిద్ధడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, వైస్ చైర్పర్సన్ ప్రసన్నలక్ష్మీ, మార్కెట్ చైర్మన్ సురేందర్, ఎంపీపీ అరవిందరావు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆర్.ఆంజనేయులు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.