Vikarabad | కొడంగల్, ఏప్రిల్ 20 : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ గుర్నాథ్రెడ్డి తెలిపారు. ఆదివారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘం లిమిటెడ్ హస్నాబాద్ ఆధ్వర్యంలో కొడంగల్, పెద్ద నందిగామ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందులు లేని విధంగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాబట్టి రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్‌రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు కటకం శివకుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నందారం ప్రశాంత్, టీపీసీసీ ప్రతినిధి మహమ్మద్ యూసూఫ్‌తో పాటు చిదిరి వినోద్, శంకర్‌నాయక్, కేవీ రాజేందర్, సంజీవ్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.