Manchala | మంచాల, మార్చి 25 : మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో కరువు విలయ తాండవం చేస్తుంది. బోరు బావుల్లో నీళ్లు అడుగంటి పోవడంతో వరి పొలాలు బీటలు పారుతున్నాయి. సాగు నీటి కోసం రైతులు అప్పుసప్పు చేసి బోరు బావులను 500 నుంచి 1000 ఫీట్ల వరకు వేసినా నీళ్లు రావడం లేదు. ఉన్న కొద్ది పాటి పొలంలో అన్నదాతలు వరితో పాటు కూరగాయల పంటను సాగుచేసుకుంటే ఇప్పుడు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లల్లో నీళ్లు తగ్గిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.
సకాలంలో వర్షాలు పడకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. దీనికి తోడు సాగుకు సరిపడ సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఆరుగాలాం కష్టపడి పంటచేతికి వచ్చే దశలో కండ్ల ముందే ఎండిపోతున్న పంటను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చేతికి వచ్చే దశలో పంటలు ఎండిపోతుండడంతో చేతికి వచ్చే దశలో చేసేదిఏమీ లేక పశువులకు గొర్రెలు, మేకలకు మేతగా వేస్తున్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు కాంగ్రేస్ ప్రభుత్వం అన్నివిధాలా అదుకోని నష్టపరిహారం చెల్లిస్తేనే రైతు అప్పు ఊబిలోంచి బయటపడుతాడని లేకుంటే చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి రైతుకు ఏర్పడింది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల్లో ఏనాడు కూడా కరువు ఈప్రాంతంలో కనిపించలేదు. పుష్కలంగా చెరువుల్లో, చెక్‌డ్యాంలో నీరు ఉండేది. దీంతో భూగర్భజలాలు పెరిగి బావులు, బోర్లు పుష్కలంగా నీరు ఉండేవి. దీంతో ఈప్రాంతంలో భూములన్ని వరి పైర్లతో కనిపించేవి. రైతులు పొలాల్లో నాట్లు వేసిన నుంచి కోతకోసే వరకు ఎంతో మందికి ఉపాధి చూపించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. గతంలో మండలంలో ఎల్లమ్మతండా నుంచి లోయపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా కనుచూపు మేరలో పచ్చని పంటపొలాలు గతంలో దర్శనమిచ్చేవి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. సాగుచేసుకున్న పొలాలు ఎండిపోతుండడంతో రైతులు కన్నీటి పర్వతం అవుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు, రైతు రుణమాఫీ అందరికీ అయ్యాయి. ఆయన ఉన్నప్పుడే పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉండేవారని ఇప్పుడు మళ్లీ పాతరోజులు వచ్చాయని రైతులు పేర్కొన్నాయి.
గిరిజన కుటుంబాలకు చెందిన వారు వ్యవసాయాన్నే నమ్ముకున్నం. కళ్ల ముందే పంటలు ఎండుతున్నాయి. నాకు ఎకరం భూమి ఉంది. వరి పంటను సాగుచేశాను. బోరు బావి ఒకటి ఉన్నా అది ఎండిపోయింది. పంటసాగుకు 30వేలు అప్పుతెచ్చి వరి వేసుకుంటే ఇప్పుడు వరి పొలం ఎండుతుంటే దాన్ని చూసి కన్నీళ్లు ఆగడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెరువులు, కుంటలు నిండాయి. బోర్లల్లో నీళ్లు ఎండేవి. ఆయన రైతులకు దేవుడు. ఆయన ఉన్నప్పుడే పంటలు బాగా పండాయి. ఇప్పుడు కాంగ్రేస్ వచ్చినంక కరువు వచ్చింది. చెరువులు, కుంటలు ఎండాయి. బోర్లల్లో నీళ్లులేకుండా పోయాయి. ఇదేమీ బాధ దేవుడా అంటూ రైతు వాపోయాడు.
రైతు గోస పాలకులకు పట్టడం లేదు. పంటలు ఎండిపోతున్నా మా బాధలు తెలుసుకునేందుకు అధికారులు రావడం లేదు. ఒక్కసారిగా కరువుతో బోర్లు ఎండిపోయాయి. నేను మా అన్న ఇద్దరం కలిసి నాలుగు ఎకరాలు వరి పంట సాగుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మూడు బోర్లల్లో నీళ్లు లేక ఎండిపోయాయి, పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని కొట్టినా ఏమూలకు సరిపోవడం లేదు. రైతు గోస ప్రభుత్వానికి పట్టడం లేదు. రైతు ఏడిస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి. రైతు గోసను పట్టించుకోండి.