బొంరాస్పేట, ఏప్రిల్ 28 : తూతూమంత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. అందులో వడ్లను కొనుగో లు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలం లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో మెట్లకుంట, బురాన్పూర్, బొంరాస్పేట, ఒడిచెర్ల, కొత్తూరు, రేగడిమైలారం, తుంకిమె ట్ల, చౌదరిపల్లి, బాపల్లి, ఏర్పుమళ్ళ తదితర గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను అధికారులు, నాయకులు కలిసి ప్రారంభించారు.
అయితే, ఓపెన్ చేసి వారం రోజులు దాటినా ఏర్పుమళ్ళ, బాపల్లి, బొంరాస్పే ట, మెట్లకుంట, బురాన్పూర్ గ్రామాల్లో గింజా ధాన్యాన్ని కూడా ఇప్పటివరకు కొనకపోవడంతో.. ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు సౌకర్యాల్లేక అకాల వర్షాలతో పంట మొత్తం నష్టపోతుందనే భయంతో మద్దతు ధర రాకున్నా.. రైతన్న మధ్య దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నా రు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని.. ధాన్యాన్ని త్వరగా కొనాలని ఆదేశించి నా కేంద్రాల నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల నుంచి ధాన్యాన్ని త్వరగా సేకరించాలని కోరుతున్నారు.
వెంటనే కొనాలి..
ధాన్యం కొనుగోలు విషయంలో నిర్ల క్ష్యం తగదు. గోనె సంచులు, సిబ్బంది ని కొనుగోలు కేంద్రా ల నిర్వాహకులు త్వరగా ఏర్పాటు చేసుకుని.. వడ్లను రైతుల నుంచి సేకరించాలి. అకాల వర్షాలు పడితే అన్నదాతలు మొత్తం నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
-మహేందర్రెడ్డి, ఏర్పుమళ్ళ
కల్లాల్లోనే ధాన్యం..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రాల్లో వారం రోజులు దాటి నా వడ్లను కొనడం లేదు. దీంతో ధాన్యం కల్లాల్లోనే ఉంటున్నది. ఒక వైపు అకాల వర్షాలు పడుతుండడం తో ధాన్యం తడవకుండా ఉంచేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ధాన్యాన్ని సేకరించాలి.
– యాదగిరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, ఏర్పుమళ్ళ