Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 15 : ఇబ్రహీంపట్నం మార్కెట్‌యార్డులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మార్కెట్‌కమిటీకి ఆదాయం పెంచడం కోసం రూ.1.25కోట్లతో నాటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భూమిపూజ చేసి నిర్మాణం పూర్తిచేయించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ నిర్మాణం పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ అనంతరం గెలుపొందిన కాంగ్రెస్ సర్కారు ఈ మాడిగెలను పట్టించుకోకుండా వృథాగా వదిలేసింది.
ఇబ్రహీంపట్నంలోని సాగర్ రహదారి నుంచి బృందావన్ కాలనీకి వెళ్లేందుకు ఈ మడిగెల వెంట రోడ్డును ఏర్పాటు చేయటంతో పాటు 17 మడిగెలను నిర్మించారు. ఇవి అందుబాటులోకి తీసుకొస్తే మార్కెట్‌కమిటీకి మరింత ఆధాయం పెరిగే అవకాశమున్నందున వెంటనే ఈ మడిగెలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు, వ్యాపారులు కోరుతున్నారు.
త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం : గురునాథ్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ చైర్మన్
ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్‌యార్డులో నిర్మించిన 17 మడిగెలను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తాం. త్వరలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభించి యాక్షన్ ద్వారా మడిగెలను అలాట్ చేసి మార్కెట్‌కు ఆధాయం పెంచేందుకు కృషిచేస్తాం.