రంగారెడ్డి : ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను నార్సింగి చౌరస్తాలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అరకు నుంచి గంజాయి హైదరాబాద్ తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్‌లో గంజాయి ప్యాకింగ్ చేసి విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.