మన్సూరాబాద్, జూన్ 16 : పార్టీలు, రాజకీయాలకతీతంగా పరిపాలనను కొనసాగిస్తూ అన్ని నియోజకవర్గాల రూపురేఖలు మారుస్తానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ పరిధి పెద్దచెరువు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై మార్నింగ్ వాకర్స్‌ను కలుసుకున్నారు. ఈటల మాట్లాడుతూ.. అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా పని చేస్తానన్నారు.
నాగోల్ డివిజన్ పరిధి శుభం కన్వెన్షన్ హాల్లో కార్పొరేటర్ చింతల అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ కొత్త రవీందర్‌గౌడ్, నాయకులు కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, వనపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాంపల్లి రామేశ్వర్, పాతూరి శ్రీధర్‌గౌడ్ పాల్గొన్నారు.
హయత్‌నగర్ : ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని మల్కాజిగిరి ఎంపీ ఈటల అన్నారు. ఆదివారం హయత్‌నగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్ హాల్లో హయత్‌నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ ఈటల మాట్లాడుతూ.. మల్కాజిగిరి సెగ్మెంట్‌ను అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.
కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, రాష్ట్ర నాయకులు కళ్లెం రవీందర్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, ఎల్బీనగర్ కన్వీనర్ కోట రవీందర్, సీనియర్ నాయకులు వెంకటేశ్ గౌడ్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేశ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘి అశోక్, గోవిందచారి, కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.