కొడంగల్, సెప్టెంబర్ 22 : కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేదని, కాంగ్రెస్‌పై ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నమ్మకం పోయిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో బొంరాస్‌పేట మండలం సంట్రకుంట తండా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బొంరాస్‌పేట మండలానికి చెందిన దుప్‌చెర్ల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు 50మందికి పైగా ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గెలిచిన రేవంత్‌రెడ్డితో కొడంగల్‌కు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని, ఆయన స్వలాభం కోసం కొడంగల్ ప్రజలను వాడుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కొడంగల్ ప్రజలు రేవంత్‌కు గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితోనే కొడంగల్ అభివృద్ధి సాధ్యపడిందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ దుద్యాల మండల అధ్యక్షుడు చాంద్‌పాషా, సంట్రకుంట, దుప్‌చెర్ల సర్పంచ్‌లు లక్ష్మీబాయి, సుస్మితలతో పాటు బీఆర్ఎస్ నాయకుడు రాజూనాయక్ పాల్గొన్నారు.