కందుకూరు, ఆగస్టు 25 : ప్రజలపై గ్రామ దేవతల ఆశీస్సులు ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. లేమూరు గ్రామంలో గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మల విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవంలో ఆమె పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భగవంతుని కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని అన్నారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. మాజీ ఉప సర్పంచ్ సురుసాని కొండల్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలుక మేఘనాథ్‌రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ ఢిల్లీ గణేశ్, గల్వి జైపాల్, సంజీవరెడ్డి, మహేందర్, నారాయణ, అర్జున్, శ్రీధర్, నవీన్, జంగయ్య పాల్గొన్నారు.
కందుకూరు మండల కేంద్రంతో పాటు నేదునూరు, అగర్మియాగూడ, జైత్వారం గ్రామాల్లో ఉదయం అమ్మవారికి బోనాలను సమర్పించారు. అనంతరం తొట్టెల ఊరేగింపులను నిర్వహించారు. మండల కేంద్రంలో నవతరం యూత్ సభ్యులతో పాటు ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, మాజీ వార్డు సభ్యులు ప్రశాంత్‌చారి, తాళ్ల కార్తీక్, సౌడపు వెంకటేశ్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు బొక్క దీక్షిత్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శి కుంచకూరి వెంకటేశ్వర్లు గుప్తా, మాజీ ఉప సర్పంచ్ గుండ్ర సుధాకర్‌రెడ్డి, బీజేపీ మండల కార్యదర్శి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.