తాండూరు, మే 16 : తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లకు మహర్దశ వచ్చింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కృషితో తాండూరు పట్టణంలో ఎన్హెచ్ఏ కింద విడుదలైన రూ.23 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. రోడ్డు వెడల్పు, ఇరువైపులా తారు రోడ్డుతోపాటు ఫుట్‌పాత్ తదితర పనుల ను చేపట్టేందుకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులను విడుదల చేస్తూ 217 జీవోను జారీ చేసింది.
దీంతో తాండూరు బస్‌స్టేషన్ నుంచి సెయింట్ మార్క్స్ స్కూల్ వరకు రోడ్డుకు ఇరువైపులా తారు రోడ్డు, మురుగు కాలువల పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. తాజాగా విడుదలైన రూ.25 కోట్లతో తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లకు కొత్త శోభ రానున్నది. దీంతో సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డిలకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.