పరిగి టౌన్, డిసెంబర్ 10: పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ టి. రాం మోహన్‌రెడ్డి విజయోత్సవ ర్యాలీని ఆదివారం పరిగిలో ఘనంగా నిర్వ హిం చారు. ప్రధాన వీధులగుండా ర్యాలీ సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై డీజే పాటలకు నృత్యాలు చేశారు. వారినుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందు పర్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.
ఇప్పటికే రెండు హామీలు అమలులోకి వచ్చాయన్నారు. ఎవ్వరూ అధైర్యపడవద్దని అండగా తానున్నానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ రితిక్‌రెడ్డి, పార్టీ నాయకులు హన్మంతు ముది రాజ్, లాల్‌కృష్ణప్రసాద్, పాలాది శ్రీను, ఎర్రగడ్డపల్లి క్రిష్ణ, అయూబ్, గోపాల్, శివకుమార్, పరుశు రాంరెడ్డి పాల్గొన్నారు.
పూడూరు,డిసెంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎమ్మెల్యే టి. రాంమోహన్‌రెడ్డి మండలంలోని మన్నెగూడ బస్టాండ్‌లో ఆదివారం ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో డీపీవో తరుణ్, పరిగి డిపో అధికా రులు కరుణశ్రీ, పీఏసీఎస్ చైర్మన్ సతీష్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సురేం దర్, రఘనాథ్‌రెడ్డి, కండ్లపల్లి శ్రీనివాస్, అజీంపటేల్, సుభాన్ రెడ్డి, బాల మణి, గంగాధర్ తదితరులు ఉన్నారు.