పరిగి, జూన్ 15: సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలకు మహర్దశ చేకూరిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల స్వరూ పమే పూర్తిగా మారిపోయిందని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం పల్లె ప్రగతి ఉత్సవాలను పురస్కరించుకొని పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వర్కర్లను ఎమ్మెల్యే సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు నిలయాలుగా మారాయన్నారు. గతంలో గ్రామానికి ముందు పెంటకుప్పలు దర్శనమిచ్చేవని, ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండేదన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమం అమలుతో రోడ్లు, ఇండ్ల పరిసరాలన్నీ శుభ్రంగా కనిపిస్తున్నా యని, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకంతో పచ్చదనంతో నిండిపోయిందని చెప్పారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాల నిర్మాణం, డంపింగ్ యార్డు ఏర్పాటు, గ్రామపంచాయతీకి ట్రాక్టర్, నీటి ట్యాంకర్ సమకూర్చినట్లు తెలిపారు. ప్రతిరోజు ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేయడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత కనిపిస్తున్నదని తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీకి నూతనంగా భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే చెప్పారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతో పాలన ప్రజలకు మరింత చేరువైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, ఎంపీడీవో శేషగిరిశర్మ, ఎంపీవో దయానంద్, సర్పంచ్ పెద్ద లక్ష్మి, ఉపసర్పంచ్ విజయ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
రూ. కోటి నిధులతో అభివృద్ధి పనులు
కొడంగల్, జూన్ 15: మండలంలోని పర్సాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా రూ.10లక్షలతో మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఒక్క పర్సాపూర్ గ్రామం లోనే గడిచిన నాలుగు సంవత్స రాల్లో రూ.కోటి నిధులతో అభివృద్ధి పనులు జరిగినట్లు తెలిపారు. గ్రామంలో ఏండ్ల కాలం నాటి కందకాన్ని పూడ్చి వేసి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొ న్నారు. గ్రామ పంచాయతీ విధులు నిర్వర్తించేందుకుగాను ప్రత్యేకగా రూ.20లక్షలతో గ్రామ పంచా యతీ భవనాలను మంజూరు చేసి నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ పథకంకింద ఒక్క పర్సాపూర్ గ్రామానికి రూ.11లక్షలు ప్రతి నెల మంజూరు అవుతున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గ్రామంలో 23మంది రైతులకు రైతు బీమా రూ.10కోట్లు మంజూ రైందన్నారు. గ్రామంలో రూ.30లక్షలతో పాఠశాల భవన మరమ్మతులతో పాటు అదనపు గదులు, ప్రహారీ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, సర్పంచ్ సయ్యద్ అంజద్, ఎంపీటీసీ గోవిందమ్మ, ఉప సర్పంచ్ మొగులయ్య, ఎంపీడీవో పాండు, ఏంపీవో శ్రీనివాస్, పీఆర్ ఏఈ రవి కిరణ్‌లతో పాటు మహిళా సంఘం సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
బొంరాస్‌పేట, జూన్ 15 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్ని రంగా లలో అభివృద్ధి సాధించాయని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం దుద్యాల మండలంలోని ఆలేడ్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించే గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. పల్లె ప్రగతి దినోత్సవంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను సన్మానిం చారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రతిపల్లె రూపురేఖలు మరాయి..
ధారూరు/వికారాబాద్ : తెలంగాణలో ప్రతి పల్లె అభివృద్ధి చెందిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధి లోని పులుమద్ది గ్రామంలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు సైకిళ్లు పంపిణీ చేశారు. వికాలాంగుల పింఛన్ వెయ్యి రూపాయలు పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతిని ప్రారంభించి, ఒక ప్రణాళిక బద్దంగా గ్రామానికి కావలసిన అన్ని సౌకర్యాలతో ఉత్తమ గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితిఅధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నాగరాజు, నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తండాలకు స్వయం పాలన
పెద్దేముల్, జూన్ 15 : గిరిజనతండాలను నూతన గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులే స్వయంగా గ్రామాలను పరిపాలించుకొనే విధంగా వెసులుబాటు కలిగిం చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నా రు. గురువారం మండల పరిధిలోని హన్మా పూర్, తట్టేపల్లి, ఓమ్లానాయక్ , జయరాంతండా(ఓ) గ్రామాల్లో రూ.20 ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు. పల్లె ప్రగతి దినోత్సవంలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ప్రతి చిన్న గిరిజన తండాను నూతన గ్రామ పంచాయతీగా ప్రకటించి ప్రత్యేకంగా నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నారన్నారు.ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ లు ఏర్పాటు కావడంతో నేడు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రూ.50 లక్షల నిధులు మంజూరు అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ టి.అనురాధరమేశ్, సర్పం చులు సుమలత, రామమ్మ, రాధోడ్ చావ్లీ బాయి,రుక్కిబాయి, ఎంపీటీసీలు లొం కనీ, శంకర్,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టి.రమేశ్,నారాయణ రెడ్డి, జయ రాంనాయక్, వెంకట్,రవి,రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షుడు వెంకటేష్‌చారి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ధన్సింగ్,బీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు రాజ్‌కుమార్, పాండు, శ్రావణ్, భరత్, లక్ష్మణ్, అంజయ్య, మహబూబ్,ఖదీర్,గోపాల్,జిల్లా సంక్షేమ అధి కారి లలితకుమారి,ఎంపీడీఓ లక్ష్మప్ప,పంచాయతీ కార్యదర్శులు క్రిష్ణ,రజిత,చైతన్య పటేల్,నాయకులు,గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పరుగులు..
దోమ, జూన్ 15: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామాలకు ప్రత్యేక నిధు లను మంజూరు చేసి సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిని పరుగులు పెట్టించారని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దోమ మండల పరిధిలోని బడెంపల్లి గ్రామంలో గురువారం సర్పంచ్ కవితాశ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ నాగిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీససీ దామోదర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం,సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, కృష్ణారెడ్డి, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గణనీయంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి
మోమిన్‌పేట, జూన్ 15: తెలంగాణలో గణనీయంగా గ్రామ పంచాయతీల అభి వృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు.గురువారం మోమిన్‌పేట మం డల పరిధిలోని గోవిందాపూర్ గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణ పనుల శంకుస్థానన, రూ.35 లక్షల నిధులతో నూ తనంగా వేసిన సీసీ రోడ్డు పనులను,వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడలో రూ.20 లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణ పనుల శంకుస్థాపన, రూ.35 లక్షల నిధులతో నూతనంగా వేసిన సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు.
సహృదయుడు సీఎం కేసీఆర్
కొడంగల్, జూన్ 15:మండలంలోని పర్సాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై రైతు ఉప్పరి దస్తప్ప హర్షం వ్యక్తం చేశారు. బిడ్డ పుడితే పైస లు, పెళ్లి చేస్తే.. పైసలు, రైతు చనిపోతే బీమా పథ కం కింద రూ.ఐదులక్షల అందించి సీఎం ఆదుకుంటున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం కింద సంవత్సరానికి రూ.10వేల పంట పెట్టుబడి, పండించిన పంటను గిట్టుబాటు ధరతో కొనుగోళ్లు, రైతు సంఘటితానికి రైతువేదికలు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దీర్ఘకాలిక రోగులకు ఆసరా పెన్షన్ అందించి అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు అందించే రూ.3,116 సరిపోవని, వెయ్యి పెంచి రూ. 4,116 అందించనున్నట్లు ప్రకటించడం సంతోషమన్నారు. ఇటువంటి పాలన గతంలో ఏనాడూ చూడలేదని, ప్రజా, రైతు కష్టాలను తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టే ప్రజా సంక్షేమంపై పట్టు, ఆదుకోవాలనే సహృదయం ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.