చేవెళ్లటౌన్, ఏఫ్రిల్ టౌన్ 14: ప్రపంచ దేశాలకు అంబేద్కర్ ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళలు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దేశ ఘనకీర్తిని ప్రపంచ దేశాలకు చాటడమే కాకుండా భారతదేశ రాజ్యావగాన్ని రచించి బడుగు బలహీన వర్గల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడు అంబేద్కర్రని అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
విద్య పరంగా అభివృద్ధి చెందినప్పుడే అంబేద్కర్ కలలు నేరవేర్చినట్లవుతుందన్నారు. పేదలందరికి సమాత్వం, ఆత్మగౌరవం దక్కాలన్నదే అంబేద్కర్ ఆశయమన్నారు. అంబేద్కర్ ఫలాలు అందరికి దక్కే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మంగలి బాల్రాజ్, మాజీ జెడ్పీటీసీ కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండారి ఆగిరెడ్డి, ఎంపీటీసీ రాములు, గుడిమల్కాపూర్ డైరెక్టర్ పాండు యాదవ్, చేవెళ్ల మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ నర్సిములు, డైరెక్టర్ .నార్ధన్, అంబేద్కర్ సంఘం కమిటీ అధ్యక్షులు ప్రవీణ్, సీపీఐ నాయకులు, సీనియర్ నాయకులు, అంబేద్కర్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.