చేవెళ్లటౌన్, మే 22 : పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సమీపంలో నూతనంగా నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో పేదల కల అయిన సొంతింటి ఆశయాన్ని సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫ్రారంభించిందన్నారు. ప్రతి పేదవాడికి ఈ పథం ద్వారా ఇండ్లు వచ్చే విధంగా చేస్తామన్నారు.
అనంతరం లిబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డ మీది పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బేగరి రాములు, గుడిమల్కాపూర్ డైరెక్టర్ పాండు యాదవ్, మాజీ జెడ్పీటీసీ కృష్ణా రెడ్డి, చేవెళ్ల, ముడిమ్యాల పీఏసీఏస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనే ప్రతాపు రెడ్డి, చేవెళ్ల మున్సిపాల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్లు ఆగిరెడ్డి, గోపాల్ రెడ్డి, పాండు గౌడ్, ప్రభాకర్, శంకర్ యాదవ్, జహంగీర్, భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ టేకుల పల్లి శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.